Reliance | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో ఆరు స్టాక్స్ రూ.78,163 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ- 30 ఇండెక్స్ సెన్సెక్స్ 271.32 పాయింట్ల ( 0.46 శాతం) నష్టంతో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), బజాజ్ ఫైనాన్స్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నష్టపోయాయి.
మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లాభాలతో ముగిశాయి. టాప్ -6 స్క్రిప్ట్‌లు రూ.78,163 కోట్లు నష్టపోగా, మిగతా నాలుగు స్టాక్స్ రూ. 30,467.03 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. ఇది టాప్-6 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే తక్కువ.
మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అత్యధికంగా రూ.42,113.47 కోట్ల పతనంతో రూ. 16,04,069.19 కోట్లతో సరిపెట్టుకున్నది. భారతీ ఎయిర్టెల్ రూ. 15,159.81 కోట్ల ఎం-క్యాప్ నష్టపోయి రూ. 4,26,226.99 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,272.37 కోట్లు కోల్పోయి రూ. 6,06,317.50 కోట్ల వద్ద నిలిచింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ. 5,404.06 కోట్ల నష్టంతో రూ. 6,05,219.47 కోట్ల వద్ద స్థిర పడింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,268.28 కోట్లు కోల్పోయి రూ. 4,40,295.38 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 2,945.12 కోట్లు తగ్గి రూ. 4,70,371.66 కోట్ల వద్ద స్థిర పడింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11,965 కోట్లు పెరిగి రూ. 11,33,446.05 కోట్లకు చేరుకున్నది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 9,383.46 కోట్లు వృద్ధి చెంది రూ. 6,20,254.82 కోట్లకు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,792.76 కోట్లు లాభ పడి రూ.8,02,686.8 కోట్లకు చేరుకున్నది.
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ. 3,325.71 కోట్ల లబ్ధితో రూ. 4,26,135.93 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ లీడ్‌లో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ తర్వాతీ జాబితాలో నిలిచాయి.