హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : బొగ్గు గ్యాసిఫికేషన్లోకి ప్రవేశించేందుకు సింగరేణి అడుగులువేస్తున్నది. భూగర్బ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలెట్ ప్రాజెక్ట్నకు సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం సింగరేణి భవన్లో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లితో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ జ్యోతిప్రకాశ్ జ్యోతి సమావేశమయ్యారు.
బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లోని ఐదు బొగ్గు బ్లాక్లను కోల్ గ్యాసిఫికేషన్ కోసం గుర్తించామని సింగరేణీ సీఎండీ తెలిపారు.