AirIndia-Tata | కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ)ను టాటా సన్స్ సొంతం చేసుకోవడంపై సింగపూర్ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ ఆఫ్ సింగపూర్ (సీసీసీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిరిండియాను టేకోవర్ చేయడంతో టాటా సన్స్ ఆధీనంలో మూడు ఎయిర్‌లైన్స్ ఉండటం వల్ల వాటి ప్యాసింజర్ రూట్లు ఓవర్లాప్ అవుతున్నాయని `సీసీసీఎస్` ఆందోళన వ్యక్తం చేసింది. టాటా సన్స్‌కు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో 49 శాతం, విస్తారాలో 51 శాతం వాటాలు ఉండగా, ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాలు ఉన్నాయి.
ఇండియా-సింగపూర్ సెక్టార్లో ఈ మూడు విమానయాన సంస్థలకు ప్రధాన వాటా ఉంది. ఇతర విమాన సంస్థలతో కాంపిటీటివ్ సమస్యలు తలెత్తుతాయా.. లేదా.. అన్న విషయాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉందని సీసీసీఎస్ పేర్కొంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిరిండియా తర్వాత ఈ రూట్లో గణనీయ ప్రయాణికుల వాటా కలిగి ఉంది. కనుక మరోమారు ఇండియా-సింగపూర్ సెక్టార్ పరిధిలో విమానయాన సంస్థల మధ్య పోటీ వాతావరణానికి విఘాతం కలుగుతుందా.. లేదా.. అన్న విషయమై సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని సీసీసీఎస్ వెల్లడించింది.
ఎయిరిండియా స్వాధీనంపై గత జనవరిలో టాటా సన్స్ అనుబంధ సంస్థ టలాకా ( Talaca ) నుంచి సమర్పించిన అప్లికేషన్‌ను సీసీసీఎస్ ఆమోదించింది. సింగపూర్ కాంపిటీషన్ యాక్ట్ – 2004 ప్రకారం ఎయిరిండియా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య విలీన ఒప్పందాన్ని సీసీసీఎస్ ఆమోదించాల్సి ఉంటుంది.