Silver Rate : దేశంలో గత కొన్ని నెలలుగా వెండి (Silver), బంగారం (Gold) ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. బంగారం కంటే వెండి మరింత వేగంగా పరుగులు తీస్తున్నది. ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,41,220 చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,28,350కి పెరిగింది. వెండి మాత్రం ఏకంగా రూ.20 వేలు పెరిగింది.
కిలో వెండి ధర శుక్రవారం రూ.2.54 లక్షలు ఉండగా.. ఇవాళ నమ్మశక్యంకాని రీతిలో ఏకంగా రూ.20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరుకుంది. శుక్రవారం కూడా వెండి ధర భారీగానే పెరిగింది. గురువారం కిలో వెండి ధర రూ.2.45 లక్షలు ఉండగా.. శుక్రవారం రూ.9 వేలు పెరిగి రూ.2.54 లక్షలకు పెరిగింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక హెచ్చుతగ్గులు లాంటి వివిధ సవాళ్ల కారణంగా వెండి, బంగారం తరచూ వాటి విలువను పెంచుకుంటున్నాయి.
దాంతో తరతరాలుగా బంగారం, వెండి లోహాలు స్థిరమైన పెట్టుబడిగా పరిగణించబడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ఇవాళ వెండి ధర అమాంతం రూ.20 వేలు పెరగడం బులియన్ మార్కెట్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.