రూ 5 వేలు తగ్గిన వెండి ధర
వెండి ధర మరింత తగ్గింది. సోమవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో విలువ రూ.5,000 దిగి రూ.2,50,000 (అన్ని పన్నులతో సహా) వద్ద స్థిరపడింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: వెండి ధర మరింత తగ్గింది. సోమవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో విలువ రూ.5,000 దిగి రూ.2,50,000 (అన్ని పన్నులతో సహా) వద్ద స్థిరపడింది. కాగా, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటం వల్లే ఈ ధరల పతనమని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం రేటు రూ.700 పెరిగి రూ.1,59,200 పలికింది. దీంతో సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటుండటం, టెక్నాలజీ-ఏఐ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పుత్తడి వైపునకు పరుగులు పెడుతుండటం ఇందుకు కారణంగా బులియన్ వర్గాలు చెప్తున్నాయి.
ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికొస్తే.. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం ధర రూ.1,43,400గా ఉన్నది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 40.10 డాలర్లు దిగజారి 5,003.01 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ 76.94 డాలర్లుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

