హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.325.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.26.55 కోట్ల నికర లాభాన్ని గడించింది హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీ. ఆదాయంలో 45 శాతం పెరుగుదల కనిపించగా, నికర లాభంలో మాత్రం స్వల్ప వృద్ధి నమోదైంది.