LIC | న్యూఢిల్లీ, మార్చి 23: బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఎంపిక చేసింది. ప్రభుత్వ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు చీఫ్‌లను ఎంపికచేసే ఎఫ్ఎస్ఐబీ తాజా సిఫార్సును గురువారం వెల్లడించింది.
ఎల్ఐసీకి నలుగురు ఎండీల్లో ఒకరైన మొహంతికి ఇటీవల తాత్కాలిక చైర్మన్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ బాధ్యతల్లో జూన్ మధ్యనాటికల్లా 3 నెలలపాటు ఆయన కొనసాగుతారు. చైర్మన్‌గా మొహం తి ఎంపికపై ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుకు ఇంకా ప్రభుత్వం తుది ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.