న్యూఢిల్లీ, మార్చి 12: ఇన్ఫోసిస్లో శ్రుతీ శిబూలాల్ వాటా మరింత పెరిగింది. అదనంగా రూ.469.69 కోట్ల విలువైన షేర్లను బుధవారం ఆమె ఓ బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా కొనుగోలు చేశారు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లోని బ్లాక్ డీల్ డాటా ప్రకారం శ్రుతీ 29.84 లక్షల షేర్లను కొన్నారు.
ఒక్కో షేర్ కనీస ధర రూ.1,574. కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరు, దాని మాజీ సీఈవో ఎస్డీ శిబూలాల్ కుమార్తెనే ఈ శ్రుతీ శిబూలాల్. మంగళవారం కూడా ఈమె రూ.494 కోట్ల ఇన్ఫీ షేర్లను కొన్నారు.