ముంబై, జూలై 2: శ్రీరామ్ గ్రూపునకు చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్..ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లలో మార్పులు చేసింది. గురువారం నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం వరకు సవరించింది. రూ.10 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ వడ్డీపెంపు వర్తించనున్నదని సంస్థ వెల్లడించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 6.75 శాతం నుంచి 6.85 శాతానికి పెంచగా, 15 నెలల డిపాజిట్లపై 7.05 శాతం నుంచి 7.10 శాతానికి, 18-23 నెలల్లోపు డిపాజిట్లపై 7.05 శాతానికి సవరించింది.
అలాగే 25 నెలల నుంచి 35 నెలల్లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 7.05 శాతం నుంచి 7.10 శాతానికి సవరించిన సంస్థ..36 నెలల నుంచి 60 నెలల్లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 7.25 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా అర శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న సంస్థ..మహిళా డిపాజిటర్లకు 0.05 శాతం అదనంగా చెల్లిస్తున్నది.