Elon Musk | టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ పట్ల యువతులు మనస్సు పారేసుకుంటున్నారు. అలా ఒక మహిళా ఎగ్జిక్యూటివ్.. తన బాస్‌ను కవల పిల్లలకు తండ్రిని చేశారు. ఆ మహిళా ఎగ్జిక్యూటివ్ పేరు శివోన్ జిల్లిస్ (36). న్యూరాలింక్ అనే ఎలన్‌మస్క్ కంపెనీ సీనియర్ ఉద్యోగిగా ఉన్నారు. ఆ మహిళ తల్లి అయ్యారు. కానీ, ఎలన్‌మస్క్‌తో తాను ఏ రకంగానూ రోమాంటిక్ జీవితం గానీ, లైంగిక అనుబంధం గానీ లేదని చెప్పారు. ఐవీఎఫ్ ద్వారా (ఇంట్రో ఫర్టిలైజేషన్) ఆ ఇద్దరు పిల్లలకు అమ్మ అయ్యారు.
కెనడాకు చెందిన ఈ ఎగ్జిక్యూటివ్ న్యూరాలింక్‌లో స్పెషల్ ప్రాజెక్ట్స్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. న్యూరాలింక్‌లో జిల్లిస్ ఐదేండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత నవంబర్‌లో కవలలకు జన్మనిచ్చారు. కంపెనీ రూల్స్ ప్రకారం సంస్థలోఏ ఒక్క ఉద్యోగి, ఎగ్జిక్యూటివ్‌తో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండరాదు.
సాధారణంగా ఎలన్‌మస్క్‌తో రోమాంటిక్ సంబంధాలు లేవని జిల్లిస్ ఇచ్చిన వివరణను కంపెనీ యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. స్పెషల్ ప్రాజెక్ట్స్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగేందుకు ఆమెకు కంపెనీ యాజమాన్యం అనుమతి ఇచ్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన జిల్లిస్, ఎలన్‌మస్క్ తిరిగి సంస్థలో పనులు కొనసాగిస్తున్నారు.