న్యూఢిల్లీ, నవంబర్ 26: బహుళ వ్యాపార, పారిశ్రామిక రంగ సంస్థ ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శశికాంత్ రుయా కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏండ్లు. అనారోగ్య సమస్యలతో సోమవారం అర్ధరాత్రి ముంబైలో మరణించినట్టు రుయా కుటుంబం ఓ ప్రకటనలో మంగళవారం తెలియజేసింది. తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్ను శశి రుయా ప్రారంభించారు.