Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. అదే సమయంలో మెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 81,314.62 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి. కొద్దిసేపటికే మళ్లీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 81,858.97 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,237.01 పాయింట్లకు చేరింది.
చివరకు 138 పాయింట్ల నష్టంతో 81,444.66 వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్లు పతనమై 24,812.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1486 షేర్లు లాభపడగా.. 2,342 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టీసీఎస్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలను ఆర్జించాయి. రంగాల వారీగా, ఆటో, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా, అన్ని ఇతర సూచీలు ఐటీ, మీడియా, మెటల్, ఆయిల్, గ్యాస్, రియాల్టీ 0.5-1 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం పడిపోయాయి.