సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. ‘ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 2024 సంవత్సరానికిగాను 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల వార్షిక సామర్థ్యం’ విభాగంలో ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత, వినూత్న విధానాల్లో పెట్టుబడులు పెడుతూ, ప్రయాణాన్ని మరింత సులభంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ విజయానికి కారకులైన మా బృందానికి, భాగస్వామ్యులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన, విశిష్టమైన అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేవారు.