హైదరాబాద్, ఏప్రిల్ 27: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హైదరాబాద్ జోన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక) అధిపతిగా ఎస్హెచ్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ బాధ్యతలను స్వీకరించారు.
బ్యాంకింగ్ రంగంలో 32 ఏండ్ల అనుభవం కలిగిన శ్రీవాత్సవ.. పీఎన్బీలో వివిధ హోదాల్లో పనిచేసి ఈ స్థాయికి ఎదిగారు. మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, జార్ఖండ్ తదితర రాష్టాల్లో ఆయన సేవలందించారని గురువారం ఓ ప్రకటనలో పీఎన్బీ తెలియజేసింది. ఇక హైదరాబాద్ జోన్లో 6 సర్కిల్ కార్యాలయాలుండగా, 413 శాఖలు, 493 ఏటీఎంలున్నాయి.