పరిశ్రమలతోనే సుసంపన్నం
పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మల్లు అన్నారు. రాష్ట్రంలో సింగపూర్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆయన రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు.
- పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి
- సింగపూర్ బృందంతో భేటీ
- పెట్టుబడులకు సహకరిస్తామని వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మల్లు అన్నారు. రాష్ట్రంలో సింగపూర్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆయన రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభు త్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇకడ అన్ని వర్గాలకు అనుకూలమైన భౌగోళిక వాతావరణం, ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలున్నాయని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెరిగాయన్నారు. తాజాగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టడంతోపాటు రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవల జపాన్‌కు చెందిన జైకా.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్టు గుర్తుచేశారు.
పెట్టుబడులు పెడుతాం: పాంగ్
సింగపూర్‌కు చెందిన పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని అంతకుముందు ఆ దేశ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తెలిపారు. అర్బన్ ప్లానింగ్ విషయంలో తమకు మంచి పట్టు ఉందని కూడా తెలియజేశారు. సింగపూర్‌కు చెందిన అతిపెద్ద బ్యాంక్ డీబీఎస్.. హైదరాబాద్‌లో పనిచేస్తున్నదన్న ఆయన.. ఇక్కడి ఐటీ పారులోనూ తమ దేశ ఆఫీసులున్న విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, బయోటెక్ హబ్‌గా స్థిరపడుతున్నదని పేర్కొంటూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుంటామని స్పష్టం చేశారు.
భట్టితో బీఈఎంఎల్ సీఎండీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సచివాలయంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) కంపెనీ సీఎండీ శంతను రాయ్ తమ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ కంపెనీ కార్యకలాపాల గురించి రాయ్ వివరించారు. మెట్రో రైల్ కోచ్‌ల తయారీ, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ సంస్థ పని చేస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. దీంతో మెట్రో కోచ్‌ల తయారీలో బీఈఎంఎల్కున్న అనుభవాన్ని, వారి ఉత్పత్తుల నాణ్యతను గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడితే అందుకు అవసరమైన భూమిని కేటాయించడంతోపాటు అన్నిరకాలుగా సహకరిస్తామని సదరు సంస్థకు భరోసా ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

