ముంబై, జనవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 224.45 పాయింట్లు పుంజుకొని 76,724.08 వద్ద స్థిరపడింది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 37.15 పాయింట్లు పెరిగి 23,213.20 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో, కొటక్ బ్యాంక్ తదితర బ్లూచిప్ షేర్లకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది. కాగా, మంగళవారం కూడా సెన్సెక్స్ 170, నిఫ్టీ 90 పాయింట్లు పెరిగాయి.