కోలుకున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి తేరుకుని బుధవారం లాభాలను అందుకున్నాయి. మెటల్, కమోడిటీ, టెలికం షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.
- నష్టాల నుంచి లాభాల వైపు సూచీల పయనం
- సెన్సెక్స్ 690, నిఫ్టీ 215 పాయింట్లు వృద్ధి
- ఆకట్టుకున్న మెటల్, కమోడిటీ షేర్లు
ముంబై, జనవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి తేరుకుని బుధవారం లాభాలను అందుకున్నాయి. మెటల్, కమోడిటీ, టెలికం షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 689.76 పాయింట్లు లేదా 0.98 శాతం పుంజుకొని 71వేల స్థాయికి ఎగువన 71,060.31 వద్ద ముగిసింది. అయితే ఒకానొక దశలో 71,149.61 పాయింట్ల స్థాయికి ఎగిసిన సూచీ.. మరో దశలో 70,001.60 పాయింట్లకు పడిపోయింది. నిజానికి ఉదయం ఆరంభంలో మార్కెట్లు నష్టాల్లోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ 316.75 పాయింట్లు క్షీణించింది. కానీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ నుంచి పెట్టుబడుల వైపు మళ్లడంతో పరిస్థితి మెరుగైంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 215.15 పాయింట్లు లేదా 1.01 శాతం ఎగబాకి 21,453.95 వద్ద స్థిరపడింది. ఉదయం 60.70 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్ షేర్లలో..
టాటా స్టీల్ 3.77 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.62 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.60 శాతం, పవర్‌గ్రిడ్ 3.34 శాతం చొప్పున పెరగగా, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యునీలివర్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లూ పెరిగాయి. మంగళవారం భారీగా నష్టపోయిన జీ షేర్లు 6.70 శాతం పెరిగాయి. రంగాలవారీగా మెటల్ సూచీ 3.57 శాతం, టెలీకమ్యూనికేషన్స్ 3.21 శాతం, చమురు-గ్యాస్ 2.17 శాతం, కమోడిటీస్ 2.06 శాతం, ఎనర్జీ సూచీ 1.95 శాతం ఎగిశాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.71 శాతం, స్మాల్‌క్యాప్ 1.72 శాతం చొప్పున ఎగిశాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
ఆసియా మార్కెట్లలో జపాన్ 0.80 శాతం నష్టపోతే, హాంకాంగ్ 3.56 శాతం, చైనా 1.80 శాతం మేర పెరిగాయి. ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలూ లాభాల్లోనే కదలాడాయి. కాగా, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) మంగళవారం రూ.3,115.39 కోట్ల పెట్టుబడుల్ని దేశీయ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. గత శనివారం, ఈ మంగళవారాల్లో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. మంగళవారం ఒక్కరోజే బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.8.50 లక్షల కోట్లు హరించుకుపోయిన సంగతీ విదితమే. నాడు సెన్సెక్స్ 1,053.10 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 330.15 పాయింట్లు దిగజారింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

