Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో న్యూ సంవత్ 2081 సంవత్సరం తొలిరోజు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభం అయ్యాయి. దీపావళి పండుగ మరుసటి రోజున ఇన్వెస్టర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో మూరత్ ట్రేడింగ్ లో నిర్వహిస్తారు. శుక్రవారం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ సాగిన ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 447.90 పాయింట్ల వృద్ధితో 79,836.96 పాయింట్ల వరకూ సాగింది. దాదాపు బీఎస్ఈ-30లోని స్టాక్స్ అన్నీ లాభాల్లోనే ముగిశాయి. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 150.10 పాయింట్ల లబ్ధితో 24,355.45 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ-50లోని 47 స్టాక్స్ లాభాలలో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 80,024 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 97 పాయింట్ల లబ్ధితో 24,303 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా 2.66 శాతం, అదానీ పోర్ట్స్ 1.42, టాటా మోటార్స్ 1.35 శాతం పుంజుకున్నాయి. ఇంకా ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్ స్టాక్స్ పుంజుకున్నాయి.
గురువారం ముగిసిన సంవత్ 2080లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 14,484.38 (22.31 శాతం) పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 4,780 (24.60 శాతం) పాయింట్లు లాభ పడ్డాయి. గ్లోబల్ మార్కెట్లలో యూరోపియన్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్ లో లాభాలు గడించగా, ఏషియన్ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. జపాన్ నిక్కీ 225 పాయింట్లు, షాంఘై కంపోజిట్ 0.2 శాతం సౌత్ కొరియా కోస్పీ 0.5 శాతం నష్టపోతే, హాంకాంగ్ హాంగ్ సెంగ్ 0.9 శాతం లాభంతో స్థిర పడింది.