Stocks | ఆగస్టు ద్రవ్యోల్బణం కాస్త రిలీఫ్ ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 246 (0.37శాతం) పాయింట్ల లబ్ధితో 67,497 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 77 పాయింట్ల లాభం (0.38 శాతం)తో 20,070 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 20 వేల మార్కును దాటడం వారంలో రెండోసారి.
భారతీ ఎయిర్టెల్ 2.7 శాతం, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల లబ్ధితో ఇండెక్స్‌లు పుంజుకున్నాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ తీవ్ర ఊగిసలాట మధ్య ప్రారంభమైన స్టాక్ మార్కెట్లలో మధ్యాహ్నం తర్వాత సానుకూల వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా సాగినా.. ద్రవ్యోల్బణం కాసింత తగ్గడంతోపాటు పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) పుంజుకున్నాయి.
బీఎస్ఈ-మిడ్ క్యాప్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.85 శాతం లబ్ధి పొందాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, నెస్ట్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.
నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 4,939.85 పాయింట్ల ఆల్ టైం రికార్డు వరకూ దూసుకెళ్లి.. ముగింపు సమయానికి నాలుగు శాతం లబ్ధితో స్థిర పడ్డాయి. ఐటీ, ఐటో ఇండెక్స్ మినహా అన్ని ఇండెక్స్‌లు 1.5 శాతం వరకు లాభ పడ్డాయి.