Stock Market | ముంబై, సెప్టెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను భవిష్యత్తులోనూ తగ్గించే అవకాశాలుండటం, ఆసియా మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడవడంతో సెన్సెక్స్ మరో మైలురాయి 85 వేల స్థాయికి చేరువైంది. ఎనర్జీ, బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ముగియడం కలిసొచ్చింది. ఇంట్రాడేలో 85 వేల చేరవకు 84,980 వద్దకు చేరుకున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 384.30 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 84,928.61 స్థాయి వద్ద ముగిసింది. సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. మరో సూచీ నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 26 వేలకు చేరువైంది. చివకకు 148.10 పాయింట్లు ఎగబాకి రికార్డు స్థాయి 25,939.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఫెడ్ వడ్డీరేట్లను మరోసారి తగ్గించే అవకాశాలుండటం సూచీలకు దన్నుగా నిలిచాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
టాప్ గెయినర్‌గా మహీంద్రా
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా షేరు టాప్ గెయినర్‌గా నిలిచింది. కంపెనీ షేరు ధర 3.29 శాతం ఎగబాకింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కూడా 2.55 శాతం ఎగబాకగా, భారతీ ఎయిర్టెల్ 2.25 శాతం, కొటక్ బ్యాంక్ 1.71 శాతం లాభపడ్డాయి. వీటితోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్ లాభపడంతో సూచీలు రికార్డు స్థాయికి చేరువవడానికి దోహదపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, ఎల్అండ్టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ అత్యధికంగా 2.23 శాతం లాభపడగా, రియల్టీ 2.07 శాతం, టెలికం, ఎనర్జీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్, యుటిలిటీ రంగ షేర్లు లాభాల్లో ముగియగా..కేవలం ఐటీ రంగ షేర్లు నష్టపోయాయి.
మూడు రోజుల్లో 8.30 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పుంజుకుంటుండటంతో గత 3 రోజుల్లో మదుపరుల సంప ద రూ.8 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దీంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.4,76,03,923.17 కోట్లకు చేరింది. రూ.1.8 లక్షల కోట్ల నష్టం