చివరి గంటలో కొనుగోళ్లు.. 266 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో తొలుత అమ్మకాలకు మొగ్గుచూపిన మదుపరులు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో మధ్యాహ్నం తర్వాత తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
ముంబై, ఫిబ్రవరి 6 : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో తొలుత అమ్మకాలకు మొగ్గుచూపిన మదుపరులు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో మధ్యాహ్నం తర్వాత తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇంట్రాడేలో 82,925 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 83,580.40 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 266.47 పాయింట్లు బలపడింది. మరో సూచీ నిఫ్టీ 50.90 పాయింట్లు అందుకొని 25,693.70 వద్ద నిలిచింది. రిజర్వుబ్యాంక్ నిర్ణయం అంచనావేసినట్టుగా ఉండటంతో వడ్డీరేట్లకు సంబంధించిన రంగాలు షేర్లు తీవ్ర ఊగిసలాటలో ట్రేడయ్యాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ లిమెటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంక్‌లకు సెంట్రల్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్థిక సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురైనప్పటికీ వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సూచీలు లాభాల్లోకి వచ్చాయి.
ఐటీ షేర్లలో అమ్మకాలు
అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు వినిమయం భారీగా పుంజుకుంటుండటంతో గ్లోబల్ మార్కెట్లో ఐటీ సంస్థల షేర్లు తీవ్ర ఆటుపోటులను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా దేశీయ మార్కెట్లోనూ వరుసగా మూడో రోజూ ఈ సూచీలు భారీగా నష్టపోయాయి. హెక్సావేర్ టెక్నాలజీ షేరు 4.14 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు ఎల్‌టీఐమైండ్‌ట్రీ 2.26 శాతం, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 2.24 శాతం, టీసీఎస్ 1.69 శాతం, టెక్ మహీంద్రా 1.69 శాతం, విప్రో 1.14 శాతం, ఇన్ఫోసిస్ షేరు కూడా నష్టపోయింది.
- ఐటీసీ షేరు 5.09 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది.
- దీంతోపాటు కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్‌ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, బజాజ్‌ఫిన్‌సర్వ్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, మహీంద్రాఅండ్ మహీంద్రా, ఎల్అండ్టీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- కానీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, అదానీపోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, బీఈఎల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఇండిగో, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, ట్రెంట్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు నష్టపోయాయి.
- ఎఫ్ఎంసీజీ 2.05 శాతం అధికమవగా, టెలికాం, పవర్, రియల్టీ, ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- కానీ, ఐటీ రంగ సూచీ 1.71 శాతం పతనమవగా, సర్వీసెస్, పీఎస్‌యూ బ్యాంకింగ్, వాహన రంగ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
- ఈ వారంలో సెన్సెక్స్ 2,857.46 పాయింట్లు లేదా 3.53 శాతం, నిఫ్టీ 868.25 పాయింట్లు లేదా 3.49 శాతం చొప్పున బలపడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

