Stocks | అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో గురువారం ఉదయం పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 78,898.37 పాయింట్ల గరిష్టానికి చేరుకుని 78,173.38 పాయింట్ల కనిష్టానికి పతనమైంది. మరోవైపు, ఎన్ఎస్ఈ -50 సూచీ నిఫ్టీ 22.55 పాయింట్ల పతనంతో 23,570.20 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో 23,854.50 పాయింట్ల గరిష్ట స్థాయికి, తిరిగి 23,653.60 పాయింట్ల కనిష్టానికి పతనం అయ్యాయి.
ఎన్ఎస్ఈ-50లో 31 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర స్టాక్స్ 5.23 శాతం వరకూ లాభ పడ్డాయి. మరోవైపు టైటాన్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిం, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ సహా 18 మంది స్టాక్స్ నష్టపోయాయి. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.02, మిడ్ క్యాప్ 0.12 శాతం లాభాలు గడించాయి. సెన్సెక్స్ లో అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహింద్రా, మారుతి సుజుకి, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఆల్ట్రాటెక్ సిమెంట్ లాభ పడితే, టైటాన్, ఏషియన్ పెయింట్స్, జోమాటో, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, రిలయన్స్ స్టాక్స్ పతనం అయ్యాయి.