Sensex | ముంబై, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. మధ్యాహ్నాం వరకు నష్టాల్లో ట్రేడైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో రివ్వున ఎగిశాయి.
79,308.95-80,337.82 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 445.29 పాయింట్లు అందుకొని 80,248.08 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ సైతం 144.95 పాయింట్లు అందుకొని 24,276.05 వద్ద ముగిసింది.