Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. చాలారోజుల రోజుల తర్వాత సెన్సెక్స్ వెయ్యిపాయింట్లకుపైగా లాభపడింది. దాంతో సెన్సెక్స్ 75వేల పాయింట్ల ఎగువ ముగియగా.. నిఫ్టీ 23వేల పాయింట్లకు చేరువైంది. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు, బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 74,608.66 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత సూచీలు పెరుగుతూ వచ్చాయి.
ఈ క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడేలో 74,480.15 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 75,385.76 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 1,131.30 పాయింట్ల లాభంతో 75,301.26 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 325.55 పాయింట్లు పెరిగి.. 22,834.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,715 షేర్లు లాభపడ్డాయి. 1,153 షేర్లు నష్టపోగా.. మరో 117 షేర్లు మారలేదు. నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా తదితర షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, పవర్, రియాల్టీ, మీడియా ఇండెక్స్ రెండు నుంచి మూడుశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి రెండుశాతానికిపైగా పెరిగాయి.