Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ తొలిసారిగా గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలు ఉదయం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆ తర్వాత సూచీలు కోలుకొని లాభాల్లో పయనించాయి. ఆ తర్వాత సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో చివరలో స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,779.84 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 82,039.26 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. కనిష్ఠంగా 81,578.32కి తగ్గింది. చివరకు 73.80 పాయింట్ల లాభంతో 81,785.56 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25,030.80 పాయింట్ల వద్ద మొదలైంది.
ఆ తర్వాత కొద్దిసేపటికే 25,129.60 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 34.60 పాయింట్లు పెరిగి.. 25,052.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా స్టాక్స్ రాణించాయి. నిఫ్టీలో ఎల్‌టీఐఎండ్‌ట్రీ, విప్రో, దివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టార్లలో, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ ఒక్కొక్కటి ఒకశాతం కంటే ఎక్కువ పెరిగాయి. టెలికాం ఇండెక్స్ 0.5 శాతం, మీడియా ఇండెక్స్ 1.4 శాతం, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ 0.4 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్క్యాప్తో సహా విస్తృత సూచీలు రికార్డు స్థాయిని తాకినప్పటికీ చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.