Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. నిన్న సరికొత్త శిఖరాలకు చేరిన మార్కెట్లు శుక్రవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ నెల 23న కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టన్న నేపథ్యంలో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జోరందుకున్నది. ఈ క్రమంలో అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,585.06 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఈ క్రమంలో ఆ తర్వాత సెన్సెక్స్ కొద్దిసేపటికి 81,587.76 పాయింట్లకు చేరి జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదులయ్యాయి. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకుపైగా నష్టపోయింది.
ఇంట్రాడేలో 80,499.10 పాయింట్ల కనిష్టానికి చేరింది. చివరకు 738.81 పాయింట్లు నష్టపోయి 80,604.65 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ప్రారంభంలో లాభాలతో 24,854.80 పాయింట్లకు పెరిగి ఆల్‌టైమ్ హైకి చేరింది. చివరకు 269.95 పాయింట్లు నష్టంతో 24,530.90 వద్ద స్థిరపడింది. ఇటీవల వరుసగా లాభాలను నమోదు చేసిన మార్కెట్లలో శుక్రవారం ఒకే రోజు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో కంపెనీల మొత్తం రూ.454.4 లక్షల కోట్ల నుంచి రూ.446.4 లక్షల కోట్లకు తగ్గింది. ట్రేడింగ్‌లో దాదాపు 756 షేర్లు పురోగమించగా, 2618 షేర్లు పతనయ్యాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పేయింట్స్, బ్రిటానియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభపడగా.. టాటాస్టీల్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, టాటామోర్స్ తదితర షేర్లు భారీగా నష్టపోయాయి.