Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 74వేల పాయింట్లకు పడిపోయింది. ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలన్నీ ప్రారంభంలోనే లాభాలను కోల్పోయాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే.. సెన్సెక్స్ 74,392.54 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74,401.11 గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 73,770.59 పాయింట్లకు చేరింది. చివరకు 200.85 పాయింట్ల నష్టంతో 73,828.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.30 తగ్గి.. 22,397.20 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దాదాపు 1,463 షేర్లు పెరగ్గా.. 2,348 షేర్లు పతనమైంది. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఎన్టీపీసీ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. రంగాల వారీగా చూస్తే ఆటో, ఐటీ, మెటల్, మీడియా, రియాల్టీ 0.5శాతం నుంచి ఒకశాతం పతనం కాగా.. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి.