Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో బలహీన సంకేతాల మధ్య మార్కెట్లు ఉదయం ప్లాట్‌గానే మొదలయ్యాయి. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నా.. చివరి సెషల్లో సూచీలు పడిపోయాయి. సెన్సెక్స్ ఉదయం కిత్రం సెషన్‌తో పోలిస్తే.. 74,440.30 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 74,400.37 పాయింట్ల కనిష్ఠానికి పతనమైన సెన్సెక్స్.. గరిష్ఠంగా 74,785.08 పాయింట్లను చేరుకుంది. చివరకు 147.71 పాయింట్ల లాభంతో 74,602.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.80 పాయింట్లు తగ్గి 22,547.55 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,612 లాభపడ్డాయి.
2,166 షేర్లు పతనం కాగా.. 127 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, నెస్లే లాభాలను నమోదు చేశాయి. హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, ట్రెంట్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే, ఐటీ, మెటల్, ఆయిల్, గ్యాస్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పతనమయ్యాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, టెలికాం 0.5 షేర్లు శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం పడిపోయాయి. ఇక ఈ నెల 26న (బుధవారం) మహా శివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూసే ఉంటాయి. తిరిగి గురువారం యథావిధిగా కార్యకలాపాలు సాగించనున్నాయి.