Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్‌గా ముగిశాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో మార్కెట్లు బుధవారం మూతపడిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మార్కెట్లు సానుకూల పవనాల మధ్య లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్లో సెనెక్స్ లాభాల్లో కదలాడినా.. లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. క్రితం సెషన్ (మంగళవారం ముగింపు)తో పోలిస్తే సెన్సెక్స్ 74,706.60 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 74,520.78 కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 74,834.09 పాయింట్లకు పెరిగింది.
చివరకు 10.31 పాయింట్లు పెరిగి.. 74,612.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 2.50 పాయింట్లు తగ్గి.. 22,545.05 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 892 షేర్లు లాభపడ్డాయి. మరో 2,925 షేర్లు పతనమయ్యాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, హిందాల్కో ఇండస్ట్రీస్ నిఫ్టీలో లాభాలను ఆర్జించాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ నష్టపోయాయి. బ్యాంక్, మెటల్ మినహా అన్ని ఇతర రంగాల సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ఆటో, మీడియా, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ, పవర్ ఒకటి నుంచి రెండుశాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం తగ్గగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2శాతం పడిపోయింది.