56,000పైన సెన్సెక్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 27: భారత్ స్టాక్ సూచీలు కొత్త రికార్డుస్థాయిలపై పాగావేసాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 56,000 పాయింట్లపైన, ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రప్రధమంగా 16,700 పాయింట్లపైన ముగిసాయి. సెన్సెక్స్ 176 పాయింట్లు ర్యాలీ జరిపి 56,124 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ 68 పాయింట్లు జంప్‌చేసి 16,705 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 795 పాయింట్లు, నిఫ్టీ 255 పాయింట్ల చొప్పున పెరిగాయి.
రూ.2 లక్షల కోట్లు పెరిగిన సంపద
వరుసగా రెండు రోజులు జరిగిన ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.2,20,292 కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ చరిత్రాత్మక రికార్డుస్థాయి రూ.2,43,73,800 కోట్లకు చేరింది.