Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 226 పాయింట్ల లబ్ధితో 78,699.07 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 79,043.15 పాయింట్ల గరిష్టం నుంచి 78,699.07 పాయింట్ల కనిష్టానికి చేరుకున్నది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 63 పాయింట్ల లబ్ధితో 23,813.40 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో 23,938.85 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23,800.60 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య తచ్చాడింది. ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ కొనుగోళ్లతో ఈక్విటీ మార్కెట్లకు కలిసి వచ్చింది.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50లో 29 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎచిర్ మోటార్స్, విప్రో స్టాక్స్ 2.51 శాతం వరకూ లబ్ధి పొందాయి. మరోవైపు హిందాల్కో, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఓఎన్జీసీ, టాటా స్టీల్స్ సహా 21 స్టాక్స్ 1.81 శాతం వరకూ నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా 1.30 శాతం వృద్ధి చెందితే నిఫ్టీ ఆటో 0.97, నిఫ్టీ హెల్త్ కేర్ 0.80 శాతం లాభ పడ్డాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్ యూ బ్యాంకు, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ పైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ లబ్ధి పొందాయి. ఎస్బీఐ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జొమాటో, ఆల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ మరో 25 పైసలు పతనమై రూ.85.52లకు చేరింది. అంతర్జాతీయంగా బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 73.37 డాలర్లు పలుకుతున్నది. ఔన్స్ బంగారం 2,639 డాలర్లకు లభిస్తుంది.