ముంబై, మార్చి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు కదంతొక్కాయి. తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభమైన సూచీలకు గ్లోబల్ మార్కెట్లు ఇచ్చిన దన్నుతో మళ్లీ సెన్సెక్స్ 74 వేల మార్క్‌ను అధిగమించింది. చివరకు సెన్సెక్స్ 609.86 పాయింట్లు లాభపడి 74,340.08 వద్ద ముగియగా..మరో సూచీ నిఫ్టీ 207.40 పాయింట్లు ఎగబాకి 22,544.70 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరుల సంపద రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన కంపెనీల విలువ రూ.4,53,808.84 కోట్లు పెరిగి రూ.3,97,57,850.59 కోట్లు (4.57 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది.