ముంబై, ఆగస్టు 20: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయంగా డెల్లా కేసులు పెరుగుతుండటంతోపాటు అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లను పెంచబోతున్నదని వస్తున్న వార్తలు మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకున్నది. రూపాయి విలువ కూడా పడిపోవడం మార్కెట్లను పతనాన్ని శాసించింది. దీంతో సెన్సెక్స్ 300.17 పాయింట్లు తగ్గి 55,329.32 వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 118.35 పాయింట్లు కోల్పోయి 16,450.50 వద్ద స్థిరపడింది.
రూ.3.5 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో మదుపరుల సంపద అమాంతం కరిగిపోయింది. వరుస పతనాలతో లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. గడిచిన రెండు రోజుల్లో మదుపరులు రూ.3.5 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,38,10,668 కోట్లకు జారుకున్నది.