Anil Ambani | అనిల్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు భారతీయ సౌర ఇంధన సంస్థ (ఎస్ఈసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే మూడేండ్లు సోలార్ విద్యుత్ తయారీకి బిడ్లు దాఖలు చేయకుండా రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందు సౌర విద్యుత్ తయారీ ప్రాజెక్టులకు ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించినట్లు ఎస్ఈసీఐ తనిఖీల్లో తేలింది.
ఎస్ఈసీఐ గత జూన్ లో ఒక గిగావాట్ సౌర విద్యుత్, 2 గిగావాట్ల స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ కోసం బిడ్లు ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ లో రిలయన్స్ పవర్ అనుబంధ మహారాష్ట్ర ఎనర్జీ జనరేషన్ అలియాస్ రిలయన్స్ ఎన్ యూ బీఈఎస్ఎస్ సంస్థ పాల్గొంది. చివరి రౌండ్ బిడ్డింగ్ లో నకిలీ బ్యాంకు గ్యారంటీలు సమర్పించిందని తమ తనిఖీల్లో తేలిందని ఎస్ఈసీఐ తెలిపింది. దీంతో బిడ్డింగ్ ప్రక్రియ నిలిపివేసి వెంటనే సంస్థపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇంతకు ముందు అనిల్ అంబానీపై ఐదేండ్ల పాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి ఐదేండ్ల నిషేధం విధిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది.