ఎక్సేంజీల ద్వారా నో బైబ్యాక్
స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్‌ను ప్రవేశపెడతామని సెబీ చైర్పర్సన్ మధాబి పూరి బుచ్ వెల్లడించారు. మంగళవారం సెబీ బోర్డు సమావేశం జరిగిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
- దశలవారీగా ఎత్తివేయనున్న సెబీ
ముంబై, డిసెంబర్ 20: స్టాక్ ఎక్సేంజీల ద్వారా ప్రస్తుతం కంపెనీలు అమలు జరుపుతున్న షేర్ల బైబ్యాక్ పద్ధతిని క్రమేపీ ఎత్తివేయనున్నట్టు సెబీ ప్రకటించింది. అందుకు బదులుగా టెండర్ ఆఫర్ మార్గంలో షేర్ల బైబ్యాక్‌ను ప్రవేశపెడతామని సెబీ చైర్పర్సన్ మధాబి పూరి బుచ్ వెల్లడించారు. మంగళవారం సెబీ బోర్డు సమావేశం జరిగిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో బైబ్యాక్‌లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున టెండర్ రూపంలో అమలు చేయాలంటూ కేకి మిస్త్రీ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. అలాగే బైబ్యాక్ కోసం కేటాయించిన మొత్తంలో కంపెనీలు వినియోగించాల్సిన కనీస పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ఎక్సేంజ్‌ల ద్వారా బైబ్యాక్‌లను తాము అనుమతించేవరకూ వాటిని స్టాక్ ఎక్సేంజీల్లోని ప్రత్యేక విండోల్లో అమలు చేయాలని చెప్పారు.
సెబీ బోర్డు తీసుకున్న ఇతర నిర్ణయాలు…
- లిస్టెడ్ కంపెనీల తరహాలోనే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్స్), ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు (ఇన్విట్స్) గవర్నెన్స్ నిబంధనలు అమలు
- మ్యూచువల్ ఫండ్స్ ప్రవేశపెట్టే డైరెక్ట్ ప్లాన్స్‌ను డిజిటల్ మోడ్‌లో అందించేందుకు ఏర్పాటయ్యే ‘ఎగ్జిక్యూషన్ ఓన్లీ ప్లాట్‌ఫామ్స్’కు రెగ్యులేటరీ నిబంధనలు అమలు
- స్టాక్ బ్రోకర్ అందించే ట్రేడింగ్ సర్వీసుల్లో అవాంతరం ఏర్పడిన సందర్భంలో ఇన్వెస్టర్ల రక్షణ కోసం అందుబాటులోకి రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్‌ఫామ్. దీనిని స్టాక్ ఎక్సేంజీలు ప్రవేశపెడతాయి.
- గ్రీన్ బాండ్లకు ఉప విభాగాలుగా బ్లూ బాండ్స్, యెల్లో బాండ్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయం. వాటర్ మేనేజ్మెంట్, మెరైన్ రంగానికి చెందిన కంపెనీలు జారీచేసేవాటిని బ్లూబాండ్లుగా, సోలార్ ఎనర్జీ సంస్థలు జారీచేసే పత్రాల్ని యెల్లో బాండ్లుగా వ్యవహరిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

