న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) ఖాతాదారుల నిధుల్ని దుర్వినియోగం చేసిన కేసులో ముగ్గురు మాజీ ఉద్యోగులకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ డిమాండ్ నోటీసులు జారీచేసింది.15 రోజుల్లో రూ.1.80 కోట్లు చెల్లించాలని, లేదంటే అరెస్టు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల జప్తు తదితర చర్యల్ని చేపట్టనున్నట్టు సెబీ హెచ్చరించింది.
కేఎస్బీఎల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ హరి, మాజీ కాంప్లియెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరాజులకు గతంలో విధించిన జరిమానాను చెల్లించకపోవడంతో తాజాగా ఈ డిమాండ్ నోటీసుల్ని జారీచేసింది.