IPO | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీవోకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 30న స్విగ్గీ..సెబీకి దరఖాస్తు చేసుకోగా, ఐదు నెలల తర్వాత నియంత్రణ మండలి అనుమతినిచ్చింది.
2014లో ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం కంపెనీ విలువ 13 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది. మార్చి 31, 2023 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ వార్షిక టర్నోవర్ 1.09 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అలాగే 4,700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో షేర్లను విక్రయించడం ద్వారా రూ.10,414 కోట్ల నిధుల సేకరణకు ఇప్పటికే వాటాదారులు అనుమతినిచ్చారు