Ola Electric IPO | ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఐపీఓకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు అనుమతి ఇస్తున్నట్లు గురువారం తెలిపింది. తద్వారా రూ.7,250 కోట్ల నిధుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ వెబ్ సైట్ ప్రకారం ఐపీఓ (ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.1,750 కోట్ల నిధుల సేకరణకు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)కు అనుమతి ఇస్తున్నట్లు ఈ నెల 10న జారీ చేసిన అబ్జర్వేషన్ లెటర్లో తెలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఐపీఓ నిర్వహణకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, గోల్డ్‌మాన్ సాచెస్ సంస్థలను నియమించుకున్నది. ఈ ఐపీఓ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్.. సంస్థలో తన 47.3 మిలియన్ల షేర్లను విక్రయిస్తారు. సంస్థలో ఇన్షియల్ ఇన్వెస్టర్లు ఆల్ఫా వేవ్, అల్పైన్, డీఐజీ ఇన్వెస్ట్మెంట్, మ్యాట్రిక్స్ తదితరులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 47.89 మిలియన్ల షేర్లు విక్రయిస్తారు.