న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉత్పత్తిలో అగ్రగామి హైదరాబాదీ సంస్థ మిడ్వెస్ట్ ఐపీవోకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వాటా విక్రయంలో భాగంగా తాజా షేర్లను విక్రయించడంతో రూ.250 కోట్ల నిధులు, ప్రమోటర్లకు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడంద్వారా రూ.400 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్న. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో షేర్లను విక్రయించడం ద్వారా కోల్లారెడ్డి రామ రాఘవ రెడ్డికి రూ.360 కోట్లు, గుంటక రవీంద్ర రెడ్డికి రూ.40 కోట్ల నిధులు సమకూరనున్నాయి.