న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సమాచార లోపాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనకుగాను మైండ్‌ట్రీ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ సోమవారం జరిమానా విధించింది. ప్రవీణ్ ఉదయసూరియణ్, జీవీడీ ప్రసాద్రావులపై లక్ష రూపాయల చొప్పున ఫైన్ వేసింది. 2019 జనవరి-మార్చిలో చేపట్టిన దర్యాప్తు ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు టైటాన్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులపైనా లక్ష చొప్పున సెబీ జరిమానా విధించింది. సమాచార లోపాలకుగాను పూజా చౌహాన్, రాజేశ్ చామీపై ఈ ఫైన్ పడింది.