SEBI Chairperson | దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్పర్సన్ మాధాబీ పురీ బుచ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తున్నది. 2017లో సెబీ హోల్ టైం సభ్యురాలిగా చేరినప్పటి నుంచి 2022లో సెబీ చైర్‌పర్సన్‌గా నియమితులైన తర్వాత గత ఏడేండ్లుగా మాధాబీ పురీ బుచ్.. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించారని అధికార పత్రాల్లో సమాచారం వెల్లడిస్తోంది.
భారత కుబేరుడు గౌతం అదానీ ఆధ్వర్యంలో అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు, అవకతవకలపై యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేసింది. ఈ విషయంలో మాధాబీ పురీ బుచ్ ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు’ నిబంధనను ఉల్లంఘించినట్లు ఆ సాక్షాధారాలు చెబుతున్నాయి. ఆఫ్ షోర్ కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ కృత్రిమంగా పెంచుతున్నారని, ఆస్తులకు మించిన రుణాలు తీసుకున్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీంతో గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి వరకూ అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయినా ఇప్పుడిప్పుడే రికవరీ సాధిస్తున్నది. అదానీ గ్రూప్ లావాదేవీలపై దర్యాప్తు నిర్వహించింది.
ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థకు సెబీ నోటీసులు జారీ చేసింది. దీనికి ప్రతిగా విదేశాల్లోని అదానీ అనుబంధ సంస్థల్లో సెబీ చైర్పర్సన్ మాధాబీ పురీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీనిపై ఈ నెల 11న ప్రకటన చేసిన మాధాబీ పురీ బుచ్ దంపతులు.. హిండెన్ బర్గ్ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. తాము పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడటం లేదని పేర్కొన్నారు.
సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న అగోరా పార్టనర్స్, భారత్ కేంద్రంగా పని చేస్తున్న అగోరా అడ్వైజరీ సంస్థలను మాధాబీ పురీ బుచ్ దంపతులు నిర్వహిస్తున్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. సెబీలో హోల్ టైం మెంబర్ గా 2017లో చేరిన మాధాబీ పురీ బుచ్.. 2022లో సంస్థ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడేండ్ల కాలంలో అగోరా అడ్వైజరీ సంస్థలో 99 శాతం వాటాలు బుచ్ దంపతులవే. దీని ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం సంపాదించారని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వద్ద నమోదైన సమాచారాన్ని ప్రముఖ వార్తా సంస్థ బయట పెట్టింది. సెబీ పూర్తికాల సభ్యులుగా నియమితులైన తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గానీ, వేతనం గానీ, ఇతర వృత్తి నైపుణ్య కార్యక్రమాల ద్వారా ప్రొఫెషనల్ ఫీజులు పొందడం 2008 సెబీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. 2019లో యూనీ లివర్ నుంచి రిటైరైన తర్వాత తన భర్త ధావల్ బుచ్ సదరు కంపెనీలను తన కన్సల్టెన్సీ వ్యాపార లావాదేవీలకు వాడుకుంటున్నారని సెబీకి తెలిపినట్లు మాధాబీ పురీ బుచ్ తెలిపారు. దీనిపై సెబీ అధికారిక ప్రతినిధి స్పందించలేదు.
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!