న్యూఢిల్లీ, జనవరి 20: ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రాబోతున్నది. క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నుంచి ఫోన్‌పే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ దాఖలుపర్చనున్నది. కాగా, ఈ పబ్లిక్ ఇష్యూలో అదనంగా ఏ ప్రైమరీ క్యాపిటల్‌నూ ఫోన్‌పే సమీకరించబోదని సమాచారం. దేశీయ యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే వాటానే 45 శాతానికిపైగా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం సంస్థ రూ.7,115 కోట్ల ఆదాయాన్ని అందుకున్నది.