న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : చిప్‌ల తయారీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సైయెంట్ అనుబంధ సంస్థ సైయెంట్ సెమికండక్టర్ దూకుడు పెంచింది. అమెరికాకు చెందిన పవర్ సెమికండక్టర్ సొల్యుషన్ ప్రొవైడర్ కినెటిక్ టెక్నాలజీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది.
రూ.785 కోట్లతో 74 శాతం వాటాను హస్తగతం చేసుకున్నట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. చిప్‌ల తయారీలో టెక్నాలజీని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అమెరికా సంస్థతో జట్టుకట్టినట్టు సైయెంట్ సెమికండక్టర్స్ సీఈవో సుమన్ నారాయణ్ తెలిపారు.