SBI Utsav Diposit | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్బంగా దేశంలోనే ఎస్బీఐ తీసుకొచ్చింది స్పెషల్ స్కీం `ఉత్సవ్ డిపాజిట్`. ఈ పథకంపై సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకంటే ఎక్కువగా 6.10 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. ఈ `ఉత్సవ్ డిపాజిట్` గడువు వచ్చేనెల 28తో ముగియనున్నది. ఒకవేళ ఇందులో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి..!
ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా 1000 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ప్రారభించింది. దీనిపై ఏడాదికి గరిష్టంగా 6.10 శాతం వడ్డీ అందిస్తున్నది. ఇక సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ స్కీమ్‌లో రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఎస్బీఐ ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.90-5.50 శాతం మధ్య వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకైతే 3.40-6.30 శాతం మధ్య వడ్డీ అందిస్తున్నది. ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం వడ్డీ ఇస్తున్నది.
గడువు —————————- వడ్డీరేటు (%) —— సీనియర్ సిటిజన్లకు వడ్డీ (%)
7 నుంచి 45 రోజులు ————— 2.90 ————— 3.40
46 నుంచి 179 రోజులు ———— 3.90 ————— 4.40
180- 210 రోజులు —————— 4.40 ————— 4.90
211 రోజులు- ఏడాది ————— 4.60 —————- 5.10
ఏడాది నుంచి రెండేండ్లు ——— 5.30 —————- 5.80
రెండేండ్ల నుంచి మూడేండ్లు —– 5.35 —————- 5.85
మూడేండ్ల నుంచి ఐదేండ్లు —— 5.45 —————- 5.95
ఐదేండ్ల నుంచి పదేండ్లు ——— 5.50 —————- 6.30