SBI | దేశంలోని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన డిపాజిటర్లను పెంచుకునే దిశగా దృష్టి సారించింది. అందుకోసం రికరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) వంటి వినూత్న పథకాలను ప్రారంభించనున్నది. ఆర్థికంగా ఎదగాలని భావించే వారు విభిన్న పెట్టుబడి ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతారు. అటువంటి ఖాతాదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నందున పలువురు తమ కష్టార్జితం మదుపు చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారని, వాటిపై ఎక్కువ లాభాలు రావాలని కోరుకుంటారని సీఎస్ శెట్టి చెప్పారు. రిస్క్ ఉన్న వాటి కంటే అధిక లాభాలు వచ్చే పెట్టుబడి ఆప్షన్ల వైపే మొగ్గుతారన్నారు. అటువంటి ఖాతాదారుల కోసం కొత్త బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు.