SBI | ముంబై, నవంబర్ 18: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొత్తగా 500 శాఖలను ప్రారంభించబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధిక వడ్డీరేట్ల కారణంగా ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దీంతో వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని, ఈ నేపథ్యంలో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాలని సూచించారు.