SBI Card | ఎస్బీఐ కార్డు యూజర్లకు షాక్.. రివార్డు పాయింట్లలో కోత.. ఇంకా..!
SBI Card | ఎస్బీఐ తన క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇస్తున్న పలు రివార్డు పాయింట్లలో కోత విధించింది.
SBI Card | ఇప్పుడు మధ్య తరగతి మొదలు ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు క్రెడిట్ కార్డులు వాడటం కామన్. చాలా మంది ఆన్లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలకు.. ప్రత్యేకించి నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. క్రెడిట్ కార్డుల వాడకానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. క్రెడిట్ కార్డులతో జరిపే కొనుగోళ్లపై పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు క్రెడిట్ కార్డు వాడకం బిల్లు పే చేయడానికి 45 రోజుల టైం లిమిట్ ఉంటుంది. దేశీయంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డు వసతులు కల్పిస్తున్నాయి. ఆ జాబితాలో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కూడా ఉంది. మీరు ఎస్బీఐ కార్డు వాడుతున్నారా.. అయితే, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్) కొన్ని నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించింది. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని విభిన్న క్రెడిట్ కార్డులను బట్టి వేర్వేరు ఆఫర్లు అందిస్తున్నది.
ఎస్బీఐ క్రెడిట్‌కార్డు రూల్స్‌లో మార్పులు ఇవే
కొత్త నిబంధన ప్రకారం అరుమ్ కార్డు హోల్డర్ల (AURUM)లు.. స్పెండింగ్‌లో రూ.5లక్షల మైలురాయిని దాటితే అందజేసే ఆర్బీఎల్ లూక్స్ రూ.5000 కూపన్ తొలగించింది. దాని స్టానే టాటా క్లిక్ లగ్జరీ ఓచర్ ఇస్తారు.
అరుమ్ (AURUM) కార్డు హోల్డర్లకు ఈజీ డైనర్ ప్రైమ్ (EasyDiner Prime), లెన్స్‌కార్ట్ గోల్డ్ సభ్యత్వం (Lenskart Gold Membership) బెనిఫిట్లు లభించవు.
సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు (SimplyClick SBI Card), సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ (SimplyClick Advantage) కార్డు హోల్డర్లు జరిపే రెంటల్ పేమెంట్స్ లావాదేవీలపై 5ఎక్స్ రివార్డు పాయింట్లకు బదులు 1ఎక్స్ రివార్డు పాయింట్లు ఇస్తున్నారు.
సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు (SimplyClick SBI Card ), సింప్లీ ఎస్బీఐ అడ్వాంటేజ్ కార్డు (SimplyClick Advantage) కార్డు దారులు లెన్స్ కార్ట్‌లో జరిపే ఆన్ లైన్ లావాదేవీలపై గత నెల ఒకటో తేదీ నుంచి 10ఎక్స్ రివార్డు పాయింట్లకు బదులు 5ఎక్స్ రివార్డు పాయింట్లు అందిస్తున్నది. అయితే అపొలో 24X7, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఈజీ డైనర్, నెట్మెడ్స్ల్లో ఆన్లైన్ కొనుగోళ్లపై 10ఎక్స్ రివార్డు పాయింట్లు పొందొచ్చు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రెంట్ చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజు పెంచేశారు. దీని ప్రకారం గత మార్చి 17 నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు చేసే రెంటల్ పేమెంట్స్‌పై ఇప్పటి వరకు చెల్లించిన రూ.99 + టాక్స్ కంటే రూ.199 + టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై ఎస్బీఐ కార్డు యాజమాన్యం తన ఖాతాదారులందరికీ ఎస్ఎంఎస్ల్లో సమాచారం అందజేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

