SBI Alert | ఎస్బీఐ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ బ్యాంక్ ఖాతాదారులను కేంద్రం హెచ్చరించింది. ఖాతా బ్లాక్ కాకుండా నివారించడానికి పాన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సైబర్ మోసగాళ్లు ఫేక్ మెసేజ్ పంపుతారని, వాటికి ప్రతి స్పందించవద్దని తెలిపింది. పర్సనల్, బ్యాంకింగ్ వివరాలు షేర్ చేసుకోవాలని వచ్చే ఈ-మెయిల్స్‌కు, ఎస్సెమ్మెస్‌లకు స్పందించొద్దని సూచించింది.
రిపోర్ట్.ఫిషింగ్ @ఎస్బీఐ.కో.ఇన్ (Report at report.phishing@sbi.co.in) నుంచి `డియర్ కస్టమర్. ఈ రోజు మీ ఎస్బీఐ యోనో అకౌంట్ మూసివేయబడుతుంది. ఈ న్యూ లింక్‌లో మీ పాన్ కార్డు డిటైల్స్ షేర్చేసుకోవాలని ఉంటుంది` అని కేంద్రం తెలిపింది.
ఎస్బీఐ సైతం తన ఖాతాదారులను హెచ్చరించింది. ఖాతాదారులు తమకు వస్తున్న ఎస్సెమ్మెస్‌లను, సర్క్యులేటింగ్ టిప్స్ ప్రామాణికతను గుర్తించి, తనిఖీ చేసుకోవాలని ఎస్బీఐ కోరింది. `ముఖ్యమైన ప్రకటన. కార్డు, పిన్, ఓటీపీ, సీవీవీ వివరాలు ఎప్పుడూ ఎస్బీఐ అడుగదు. ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ వివరాలను ఏ ఒక్కరితోనూ షేర్ చేసుకోవద్దు. మొబైల్‌కు లేదా ఈ-మెయిల్స్‌కు వచ్చే గుర్తు తెలియని లింక్స్‌ను క్లిక్ చేయొద్దని ఎస్బీఐ ఇన్ఫోసెక్ టీం కోరింది. ఎస్బీఐ పేరుతో వచ్చే షార్ట్ కోడ్ ఎస్సెమ్మెస్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను ఇటీవల ఎస్బీఐ కోరింది.
A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck
▶️Never respond to emails/SMS asking to share your personal or banking details
▶️Report at👇
✉️ report.phishing@sbi.co.in
📞1930 pic.twitter.com/GiehqSrLcg
— PIB Fact Check (@PIBFactCheck) August 27, 2022
ఎస్బీఐబీఎన్కే, ఎస్బీఐఐఎన్బీ, ఎస్బీయోనో, ఏటీఎంఎస్బీఐ అనే పేరుతో వచ్చే మెసేజ్‌ల పట్ల స్పందించొద్దని సూచించింది. కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, లింక్ క్లిక్ చేయడం ద్వారా డెబిట్ కార్డ్ అన్‌లాక్ చేసుకోవాలని కొందరు ఆగంతకులు మెసేజ్‌లు పెడతారని, అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది.
పెండింగ్‌లో కేవైసీ అప్డేషన్, యోనో ఖాతా సస్పెన్షన్, సిమ్ కార్డ్ బ్లాక్, పాన్ కార్డ్ వెరిఫికేషన్ తదితర మెసేజ్‌లు ఫేక్ అని, వాటికి స్పందించొద్దని ఎస్బీఐ ఇన్ఫోసెక్ టీం తెలిపింది.