Sam Altman-Satya Nadella | చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్ ఏఐ (Open AI) మాజీ సీఈఓ శామ్ ఆల్టమన్ (Sam Altman), మాజీ అధ్యక్షుడు గ్రేగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) కీలక నిర్ణయం తీసుకున్నారు. సత్య నాదెళ్ల (Satya Nadella) సారధ్యంలోని మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నారు. ఈ సంగతి స్వయంగా సత్యనాదెళ్ల (Satya Nadella) `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` వేదికగా ప్రకటించారు.
We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…
— Satya Nadella (@satyanadella) November 20, 2023
మైక్రోసాఫ్ట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అడ్వాన్స్డ్ రీసెర్చ్ టీంకు శామ్ ఆల్టమన్ (Sam Altman)), గ్రేగ్ బ్రాక్‌మన్ (Greg Brockman) సారధ్యం వహిస్తారని తెలిపారు.
the mission continues https://t.co/d1pHiFxcSe
— Sam Altman (@sama) November 20, 2023
ఓపెన్ ఏఐ సీఈఓగా సంస్థ బోర్డు ఉద్వాసన పలికిన కొద్ది రోజుల్లోనే మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నట్లు శామ్ ఆల్టమన్ (Sam Altman) ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
`శామ్ ఆల్టమన్, గ్రేగ్ బ్రాక్‌మన్ మా సంస్థలో చేరినా, ఓపెన్ ఏఐతో కలిసి మా ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు మా భాగస్వామ్యం కొనసాగుతుంది. అందుకు విశ్వాసం కలిగి ఉంది. ఆవస్కరణకు గల ప్రతి అవకాశాన్ని కొనసాగించే సామర్థ్యం మాకు ఉంది. కస్టమర్లు, భాగస్వాముల మద్దతు కొనసాగుతుంది. ఓపెన్ఏఐ నూతన సీఈఓ ఎమ్మెట్ షేర్, నూతన నాయకత్వంతో కలిసి మేం పని చేస్తాం` అని సత్యనాదెళ్ల ట్వీట్ చేశారు.
`మా కొలీగ్స్‌తో శామ్ ఆల్టమన్, గ్రేగ్ బ్రాక్‌మన్ కలయికపై మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. వారు మైక్రోసాఫ్ట్ ఏఐ రీసెర్చ్ టీంకు సారధ్యం వహిస్తారు. త్వరిత గతిన వారి విజయానికి అవసరమైన వనరులు సమకూరుస్తాం` అని పేర్కొన్నారు. `మా మిషన్ కొనసాగుతుంది` అని శామ్ ఆల్టమన్ చేసిన ట్వీట్‌కు మద్దతుగా సత్యనాదెళ్ల రిప్లయ్ ఇచ్చారు.
మైక్రోసాఫ్ట్ కొత్తగా ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ గ్రూప్‌కు శామ్ అల్టమన్ సీఈఓగా ఉంటారు.
the mission continues https://t.co/d1pHiFxcSe
— Sam Altman (@sama) November 20, 2023
`శామ్ ఆల్టమన్ రాకతో నూతన ఆవిష్కరణకు భూమిక ఏర్పడుతుంది. అందుకోసం న్యూ గ్రూప్ సీఈఓగా ఆల్టమన్ రాక కోసం నేను అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నా.. గతంలోనూ మైక్రోసాఫ్ట్‌లో స్వతంత్ర సంస్థల నిర్మాణ సంస్కృతికి ఫౌండర్లు, ఆవిష్కర్కలకు అవకాశం కల్పించిన అనుభవం మాకు ఉంది. గిట్ హబ్, మోజాంగ్ స్టూడియోస్, లింక్డ్ ఇన్ వంటి సంస్థలకు మైక్రోసాఫ్ట్ ప్రోత్సాహం అందించింది` అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
చాట్‌జీపీటీ సృష్టికర్తగా పేరొందిన శామ్ ఆల్టమన్‌ను శుక్రవారం గూగుల్ మీట్ కాల్ ద్వారా ఓపెన్ ఏఐ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ మరునాడు గ్రేగ్ బ్రాక్మన్నూ బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు మరో గూగుల్ మీట్ కాల్లో తెలిపింది. కానీ, సంస్థలో ఆయన సేవల దృష్ట్యా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. గ్రేగ్ బ్రాక్మన్కు ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్- సంస్థ కో-ఫౌండర్ ఇల్యా సుత్స్కేవర్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ నిర్ణయాలతో కాసింత ఉద్వేగానికి గురైన సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు గ్రేగ్ బ్రాక్‌మన్ తెలిపారు. సత్యనాదెళ్ల ప్రకటనకు ప్రతిస్పందిస్తూ గ్రేగ్ బ్రాక్ మన్.. మేం కొత్త టూల్ నిర్మించబోతున్నాం. అది అత్యంత అపురూపం కానున్నది` అని పేర్కొన్నారు.
Sam and I are shocked and saddened by what the board did today.
Let us first say thank you to all the incredible people who we have worked with at OpenAI, our customers, our investors, and all of those who have been reaching out.
We too are still trying to figure out exactly…
— Greg Brockman (@gdb) November 18, 2023
ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్టమన్ నిర్ణయాలను పూర్తిగా సమీక్షిస్తామని సంస్థ బోర్డు ప్రకటించింది. శామ్ ఆల్టమన్ ఉద్వాసనతో టెక్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మైక్రోసాఫ్ట్‌తోపాటు మెజారిటీ వాటాదారులు తిరిగి శామ్ ఆల్టమన్‌ను సీఈఓగా తీసుకురావాలని సంస్థ బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. కానీ, సంస్థ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని శామ్ ఆల్టమన్ పెట్టిన షరతుతో ఆయన ఓపెన్ ఏఐలోకి తిరిగి వచ్చే అవకాశాలకు గండి పడింది. ఆల్టమన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ఓపెన్ ఏఐ తాత్కాలిక సీఈఓగా మీరా మురాటీని ప్రకటించింది. కానీ మీరా మురాటీ కూడా ఆల్టమన్‌కు మద్దతు పలకడంతో ఎమ్మెట్ షేర్‌ను నూతన సీఈఓగా నియమించింది.
Today I got a call inviting me to consider a once-in-a-lifetime opportunity: to become the interim CEO of @OpenAI. After consulting with my family and reflecting on it for just a few hours, I accepted. I had recently resigned from my role as CEO of Twitch due to the birth of my…
— Emmett Shear (@eshear) November 20, 2023