దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సరం మొదలైంది. ఈ దీపావళితో సంవత్ 2082 వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికిగాను ఆయా ప్రధాన బ్రోకరేజీ సంస్థలు తమ అంచనాలను, సిఫార్సులను ప్రకటించాయి. మదుపరులు ఏయే షేర్లలో పెట్టుబడులు పెడితే లాభిస్తుందో పేర్కొన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఈ బ్రోకరేజీ.. బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, నైకా, ఎస్బీఐ, ఎస్బీఐ కార్డ్స్, స్విగ్గీ వంటి షేర్లను సిఫార్సు చేస్తున్నది. ఈ ఏడాది ఇవి ఆకర్షణీయమని పేర్కొంటున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, ఏఐఏ ఇంజినీరింగ్, కేన్స్ టెక్నాలజీ, డాటా ప్యాటర్న్స్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్‌లలో పెట్టుబడులు లాభదాయకం అని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేస్తున్నది.
అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్, హ్యాపీ ఫోర్జింగ్స్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భారతీ ఎయిర్టెల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్అండ్టీ, నార్తర్న్ ఏఆర్సీ క్యాపిటల్, షీలా ఫోం, ఎంఎస్టీసీ, పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు మంచి రాబడులను అందిస్తాయన్న విశ్వాసాన్ని ఈ బ్రోకరేజీ వ్యక్తం చేస్తున్నది.
మారుతీ సుజుకీ, ఫియం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఎల్అండ్టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, లాయిడ్స్ మెటల్స్, రత్నమణి మెటల్స్, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్, అనంత్ రాజ్, యూరేకా ఫోర్బ్స్, ఆస్ట్రల్ షేర్లను జేఎం ఫైనాన్సియల్ సిఫార్సు చేస్తున్నది.

టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో షేర్లలో పెట్టుబడులు ఈ ఏడాది లాభదాయకం అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ భావిస్తున్నది.
బీడీఎల్, అశోక్ లీలాండ్, సెయిల్, ఫెడరల్ బ్యాంక్, సిప్లా షేర్లు ఈ బ్రోకరేజీ ప్రధాన సిఫార్సు.
వీఏ టెక్ వాబ్యాగ్, ఐఈఎక్స్, సాగిలిటి, స్కిప్పర్, ట్రాన్స్‌రైల్ లైటింగ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆప్టస్ వాల్యూ హౌజింగ్ షేర్లను ఈ బ్రోకరేజీ సిఫార్సు చేస్తున్నది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్, బీఎస్ఈ లిమిటెడ్, ఫియం ఇండస్ట్రీస్, శక్తీ పంప్స్, బ్లాక్‌బక్ షేర్లు లాభదాయకం అంటున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు పాలసీ మద్దతు, తయారీ రంగం బలోపేతం వంటి అంచనాలతో ఈ సిఫార్సులు చేస్తున్నది.
రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్, డోమ్స్ ఇండస్ట్రీస్, కేఈసీ ఇంటర్నేషనల్, చాలెట్ హోటల్స్, మిందా కార్ప్, కొటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, కాఫోర్జ్ షేర్లు ఆకర్షణీయమన్నది యాక్సిస్ సెక్యూరిటీస్ అభిప్రాయం.
ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అకుటాస్ కెమికల్, కుమ్మిన్స్ ఇండియా, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో పెట్టుబడులు ఈ బ్రోకరేజీ లాభదాయకమంటున్నది.
ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునీలివర్, మారుతీ, యాక్సిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హీరో, సుజ్లాన్ ఎనర్జీ, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, కెన్‌ఫిన్ హోమ్స్, హెచ్‌జీ ఇన్ఫ్రా షేర్లను సిఫార్సు చేస్తున్నది.
గమనిక: ఈ సిఫార్సులు, అంచనాలు మదుపరుల అవగాహన కోసమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తీవ్ర ఒడిదొడుకులకు లోనై ఉంటాయి. కాబట్టి మదుపు చేసే ముందు నిపుణుల సలహా తీసుకుని, మరింత జాగ్రత్తగా ముందుకెళ్లడం ఉత్తమం.